Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 12:38:45
facebook Twitter Googleplus
Photo

ఓ స్టార్ హీరో మీద.. అదీ తనతో కలిసి నటించిన హీరోపై కామెంట్స్ చేయడమంటే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. అదికూడా ఆ హీరోను చూసి నాకు కుళ్లుగా ఉంది అనడమంటే చిన్న విషయం కాదు. కానీ ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ శృతి హాసన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చూస్తే.. తనకు ఎప్పుడూ కళ్లు పుడుతుంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది శృతి హాసన్.

'అది డ్యాన్స్ అయినా ఫైట్స్ అయినా.. ఎన్టీఆర్ దాన్ని ఇట్టే పట్టేస్తాడు. సింగిల్ టేక్ లో కంప్లీట్ చేసేస్తాడు. ఇలాంటివాటికి అతను ఎవరి నుంచి సర్టిఫికేట్స్ - ప్రశంసలు కూడా ఆశించడు. కానీ నేనలా కాదు. కెమేరా ముందు నుంచునే ప్రతీసారి తప్పనిసరిగా రిహార్సల్ వేయాల్సిందే. ఇందుకే నాకు ఎన్టీఆర్ అంటే జెలసీ. నిజానికి అతనో ఆల్ రౌండర్. తనతో మాట్లాడుతుంటే.. ఇతనికి తెలియని విషయాలు ఏమైనా ఉంటాయా అనిపిస్తుంది' అంటూ ఎన్టీఆర్ గురించి ముచ్చట్లు చెప్పింది శృతి హాసన్

మిగిలిన హీరోల్లో అయితే రవితేజ గురించి ఎక్కుగా చెప్పుకొస్తోంది ఈ చెన్నై బ్యూటీ. కొంతమందితోనే మళ్లీ మళ్లీ చేయాలని అనిపిస్తుందని అలాంటి వాడే రవితేజ అంది శృతి. రవితేజను కాసేపు అబ్జర్వ్ చేస్తే.. తనలో ఎనర్జీ లెవెల్స్ లో ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధమవుతాయో తెలుస్తుందన్న శృతి.. బలుపు ఆడియో ఫంక్షన్ లో డ్యాన్స్ చేయడానికి కారణం.. మాస్ మహరాజ్ ఇచ్చిన ఎనర్జీనే అంటోంది. ట్యాలెంట్ కంటే రవితేజ మంచి మనసున్నోడు అంటూ సర్టిఫికేట్ ని కూడా శృతి హాసన్ ఇచ్చేసింది.

,  ,  ,  ,  ,