Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2016 17:49:56
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్: కమల్ హాసన్ కూతురుగా వెండితెరకు పరిచయమైన శృతి హాసన్ వాస్తవానికి చిన్నతనం నుండి హీరోయిన్ కావాలనేమీ కలలు కనలేదు. చిన్న తనం నుండి ఆమె లక్ష్యం పెద్ద రాక్ స్టార్ అవ్వాలనే. అందుకే 16 ఏళ్ల వయసులోనే రాక్ బ్యాండ్ మొదలు పెట్టింది. శృతి హాసన్ మొదలు పెట్టిన రాక్ బ్యాండ్ పేరు 'ది ఎక్స్‌ట్రామెంటల్స్'. ఈ బ్యాండ్‌లో శృతి హాసనే లీడ్ సింగర్ కమ్ కీ బోర్డ్ ప్లేయర్. ఈ బ్యాండ్ లో మొత్తం నలుగురు ఉండేవారు. బ్రియాన్ పైవా గిటార్ వాయించేవాడు, కితా అనే వ్యక్తి బాస్ వాయించే వాడు, జెర్మయ్య డ్రమ్స్ వాయించేవాడు. అప్పట్లో శృతి హాసన్ తన టీంతో కలిసి ఇండియాలోని వివిధ కాలేజ్ ఫెస్టివల్స్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని కాంటెస్టుల్లో కూడా విజేతలుగా నిలిచారు. శృతి హాసన్ రాక్ బ్యాండ్ కు సంబందించిన ఫోటోలు మీరు స్లైడ్ షోలో చూడొచ్చు. 'ది ఎక్స్‌ట్రామెంటల్స్' బ్యాండ్ అప్పట్లో లోకల్ రాక్ సీన్ గా బాగా పాపులర్ అయింది. అయితే అనుకోకుండా 2009లో వీరంతా డిస్‌బ్యాండ్ అయ్యారు. బ్యాండ్ లోని ఓ మెంబర్ పర్సనల్ కారణాలతో బయటకు వెళ్లడంతో ఆ స్థానాన్ని రీప్లేస్ చేయలేక 'ది ఎక్స్‌ట్రామెంటల్స్' డిస్ బ్యాండ్ అయిపోయింది. ఈ విషయమై అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ స్పందిస్తూ...'ది ఎక్స్‌ట్రామెంటల్స్' బ్యాండ్ లోని వ్యవస్థాపక మెంబర్ బయటకు వెళ్లడంతో మేం మళ్లీ మరో బ్యాండ్ ను ఫాం చేయలేక పోయాం. అయితే ఒకటి మాత్రం ష్యూర్...నేను నాకు అవకాశం వచ్చినప్పుడల్లా పెర్పార్మెన్స్ ను కంటిన్యూ చేస్తూనే ఉంటాను, అది ఇతర బ్యాండ్లతో అయినా కావొచ్చు' అని తెలిపారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన శృలి హాసన్ ఇక్కడ బిజిగా గడుపుతున్నా తనకు సమయం చిక్కినప్పుడల్లా వేరే బ్యాండ్లతో కొలాబరేట్ అవుతోంది. 'డైనోసార్ పిలె-అప్' అనే బ్రిటిష్ బ్యాండ్ తో కొలాబరేట్ అయి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. త్వరలో ఈ బ్యాండ్ ఓ ఆల్బం రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఆల్బమ్ కు శృతి హాసనే వోకల్స్ అందించారు.

,  ,  ,  ,  ,