Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-May-2016 13:31:26
facebook Twitter Googleplus
Photo

సిద్దార్థ్ తమిళ వాడే కానీ.. అతడికి సొంత భాషలో కంటే కూడా వేరే భాషల్లో చాలా మంచి పేరు వచ్చింది. ?రంగ్ దె బసంతి? సినిమాతో నేషనల్ లెవెల్లో మాంచి పేరు సంపాదించాడు సిద్ధు. ఐతే అక్కడ తనకొచ్చిన క్రేజ్ ను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. త్వరగా బాలీవుడ్ నుంచి దుకాణం కట్టేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ?నువ్వొస్తానంటే నేనొద్దంటానా?.. ?బొమ్మరిల్లు? లాంటి సినిమాలతో తెలుగులో మాంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. కానీ ఈ ఫాలోయింగ్ ను కూడా నిలబెట్టుకోలేక కొన్నేళ్లకు ఇక్కడా దుకాణం సర్దేశాడు.

చివరికి సొంతగడ్డ తమిళనాడుకు వెళ్లి అక్కడ వైవిధ్యమైన సినిమాలతో ప్రయాణం సాగించాడు. తమిళంలో రెండో ఇన్నింగ్స్ బాగానే సాగుతున్నట్లు అనిపించింది కానీ.. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్లలో మళ్లీ వెనుకబడిపోయాడు. సొంత బేనర్లో తెరకెక్కించిన ?జిల్ జంగ్ జక్? ఫెయిల్యూర్ అతణ్ని నిరాశకు గురి చేసింది. దాని తర్వాత సినిమాలేమీ లేకుండా ఖాళీగా ఉన్న సిద్ధు.. ఆశ్చర్యకరంగా ఓ మలయాళ భారీ బడ్జెట్ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు.

మల్లూవుడ్ స్టార్ హీరో దిలీప్ తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు సిద్ధు. ఆ సినిమా పేరు ?కమ్మరసంభవం?. రతీష్ అంబట్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సిద్దు మాత్రమే ఈ పాత్ర చేయగలడని ఏరి కోరి అతడిని ఎంచుకున్నాడట దర్శకుడు. తమిళ.. హిందీ సినిమాలతో మల్లూవుడ్లో బాగా ఫేమస్ అయిన సిద్ధు.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ?ఉస్తాద్ హోటల్?లోనే నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను వదులుకున్నాడు. ఇప్పుడు తన కెరీర్ ఏమంత బాగా లేని టైంలో ?కమ్మరిసంభవం? లాంటి క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కడంపై చాలా సంతోషంగా ఉన్నాడు సిద్ధు. మరి సిద్ధు అడుగుపెడుతున్న కొత్త ?వుడ్?లోనూ అతడికి బ్రేక్ వస్తుందేమో చూడాలి.

,  ,  ,  ,  ,