Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jun-2015 17:25:14
facebook Twitter Googleplus
Photo

తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన సిమ్రాన్, కొంతకాలం పాటు సినిమాలకి దూరంగా వుంది. ఆ తరువాత తన వయసుకి తగిన, ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ హారర్ యాక్షన్ చిత్రంలో పోలీస్ అధికారిణిగా నటిస్తోంది. సుజిత్ శెట్టి కథానాయకుడుగా, నికిషా పటేల్, ఇనియా నాయికలుగా కన్నడ .. తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఇటీవల కాలంలో దెయ్యం నేపథ్యంగా వస్తోన్న సినిమాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఇనియా దెయ్యంగా కనిపిస్తుందనీ, ఆమె భరతం పట్టే ధైర్యం కలిగిన పోలీస్ అధికారిణిగా సిమ్రాన్ నటిస్తోందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. తాజాగా ఈ ఇద్దరి మధ్య యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించామనీ, సిమ్రాన్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు.

,  ,