Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jul-2016 13:42:38
facebook Twitter Googleplus
Photo

సింగర్ సునీత..ఈమె పాటలు వింటే చాలు హయ్ గా అమ్మ జోలపాటలా ఉంటాయి. చిన్న వయసులోనే మంచి సింగర్ గా పేరు తెచ్చుకొని, 19 ఏళ్ల‌కే కిర‌ణ్ అనే ఇండ‌స్ర్టీకి చెందిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది.ఇద్దరు పిల్లలు పుట్టాక కిరణ్ తో విబేధాలు రావ‌డంతో అతడికి దూరంగా ఉంటుంది. ఈ లోపు రకరకాల రూమర్స్ ఈమె ఫై వచ్చాయి..

తాజాగా ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన భర్త ఫైనే కాకుండా రూమర్స్ ఫైకూడా సమాధానం తెలిపింది. తన భర్త నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడనే , భార్య , పిల్లలను పట్టించుకోని వాడు ఓ భర్త నే అంటూ వాపోయింది. తన భర్త నుండి విడిపోయాక , అతడి తరుపు వారు కావాలని నా ఫై చెడు ప్రచారం చేసారని ఓ దర్శకుడి తో అక్రమ సంబంధం కలిపారని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత ఓ మీడియా వారు ఓ రాజకీయ నాయకుడి కి నాకు అక్రమ సంబంధం కలిపి తప్పుడు ప్రచారం చేసారని ఆ తర్వాత వారు నాకు క్షేమపణలు తెలిపారని ఇంటర్వ్యూ లో చెప్పుకొని బాధపడింది. ప్రస్తుతం నా ఇద్దరు పిల్లలు పెద్దవారు అవుతున్నారు. వారిని చూసుకోవడం తప్ప మరేతర విషయాల ఫై దృష్టి పెట్టకోడదని నిర్ణయించుకున్నని తెలిపింది.

,  ,  ,  ,  ,