Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2017 10:54:59
facebook Twitter Googleplus
Photo

అసలు మన టాలీవుడ్ హీరోలు ఎంతసేపూ ఎంటర్టయిన్ చేస్తూ ఉంటారు అంతే. వాళ్ల దగ్గర జీవితానికి కావల్సినవి నేర్చుకోవడానికి ఏముంటుంది అంటారా? అబ్బే చాలా ఉంటుంది. ఏదో రైటర్ రాసిన డైలాగులు చెప్పేసి.. దర్శకుడు చెప్పినట్లు యాక్ట్ చేసేసి.. కొరియోగ్రాఫర్ చెప్పేసినట్లు స్టెప్పులేస్తే.. ఎవ్వరూ కూడా స్టార్లు అయిపోరు. అయితే కేవలం ఈ యాక్టింగ్ క్యారెక్టర్ ఒక్కటే కాదు.. మన స్టార్ల దగ్గర నుండి ఇంకా చాలా నేర్చుకోవచ్చు.

చూడండి ఒకసారి మనోళ్ళలో ఎంతమంది కులాంతర మతాంతర ఖండాంతర వివాహాలు చేసుకున్నారో. ఏదన్నా డౌటుంటే మహేష్ బాబు.. రామ్ చరణ్.. నాగ చైతన్య అండ్ పవన్ కళ్యాణ్ లను అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఒక్కో హీరో దగ్గర ఒక్క టాలెంట్ ఎడిషనల్ గా కూడా ఉంది. కష్టపడేతత్వాన్ని రవితేజ నేర్పిస్తే.. సినిమా కెరియర్లో కొత్త రూట్లో వెళితే టాప్ స్పాట్ గ్యారంటీ అంటూ పవన్ కళ్యాణ్ ను చూసి తెలుసుకోవచ్చు. అసలు ఈ కెరియర్లో నాలుగు రాళ్ళు వెనకెలా వెయ్యాలి అనే బిజినెస్ ప్రవృత్తిని మహేష్ అండ్ నమ్రత దగ్గర.. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనే నేచర్ మన రామ్ చరణ్ దగ్గర.. సంపాదించిన దాంట్లో చారిటీ ఎలా చేయాలి అనే విషయం సమంత.. లారెన్స్ దగ్గర.. సొసైటీకి ఏదన్నా హెల్ప్ చేయాలంటే ఒక గ్రామాన్ని ఎలా దత్తత తీసుకోవాలి అనే విషయాన్ని ప్రకాష్ రాజ్- మహేష్ దగ్గరా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.

గడిచిన ఎన్టీఆర్ ఏన్నార్ తరువాత.. తరువాత వచ్చిన చిరంజీవి బాలయ్యల తరం.. వీరందరూ ఒకెత్తయితే.. ఇప్పుడు టాలీవుడ్ కు రథ చక్రాలుగా మారిపోయిన కొత్త తరం ఒక రకం. వీరి దగ్గర మనం నేర్చుకోవడానికి ఎన్నేసి సబ్జెక్టులు ఉన్నాయో చూసుకోండి. ఇంకెందుకు లేటు.. మీకు నచ్చినది నేర్చేసుకోండి.

,  ,  ,  ,  ,