Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2015 11:02:36
facebook Twitter Googleplus
Photo

'జాదూగాడు' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమవుతున్న టీవీ స్టార్ యాక్ట్రస్ 'సోనారిక'కి ఆ సినిమా రిలీజ్ కాకుండానే మంచి ఆఫర్లు వస్తున్నాయి. పక్కింటి అమ్మాయిలా కనిపించే బ్యూటీ కావడంతో ఆయా దర్శకులు తమ సినిమాలకు ఆమెను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఆమెకు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. 'అల్లుడు శీను' ఫేం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా భీమనేని ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తమిళ హిట్ సినిమా 'సుందర పాండియన్'కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయికగా సోనారికను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయి.

,  ,  ,  ,