Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jul-2017 13:26:49
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతుర్లు ఇద్దరూ హీరోయిన్లు కాకపోయినా డైరెక్టర్లుగా మారి మంచి విజయమే అందుకున్నారు. సౌందర్య రజినీకాంత్ ఇప్పుడు తన డైరక్షన్ కెరియర్ పై బాగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. కొచ్చాడయన్ సినిమా తరువాత తమిళ్ హీరో ధనుష్ హీరోగా VIP2 తో డైరెక్టర్ గా మళ్ళీ బిజీ అయ్యింది అమ్మడు. ఈ సినిమాను తమిళ్ తెలుగు లో ఒకే సారి విడుదల చేస్తున్నారు. విఐపి సినిమా తమిళనాడులో సూపర్ హిట్ కావడంతో తెలుగులో కూడ దాన్ని రఘువరన్ బి టెక్ గా విడుదల చేశారు. ఇప్పుడు ఆ సినిమాకే సిక్వల్ గా విఐపి 2 రాబోతుంది.

VIP2 సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన టీమ్ ఇక్కడ మీడియాతో ఆ సినిమా విశేషాలు చెబుతూ డైరెక్టర్ సౌందర్య రజినీకాంత్ ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపింది. నాకు తెలుగులో పని చేయాలని ఉంది. మంచి కథ దొరికితే తెలుగు హీరోలతో పని చేయడానికి నేను సిద్దమే అంటోంది. ముఖ్యంగా నా అభిమాన నటుడు మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అదృష్టం వస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది అని చెప్పింది. ఇప్పటికే నాన్న సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేసిన సౌందర్య ఇప్పుడు మెగా స్టార్ ని డైరెక్ట్ చేయడానికి కలలుకంటోందనమాట. ఎలాగో మెగాస్టార్ కూడా 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు 151 కోసం కసరత్తులు చేస్తున్నారు కాబట్టి.. త్వరలోనే మరి ఈమె డైరక్షన్లో చేస్తారేమో చూద్దాం.

VIP2 సినిమాలో ధనుష్ తో పాటుగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కూడా నటిస్తోంది. ట్రైలర్ బట్టి చూస్తే కాజోల్ రోల్ ధనుష్ కు దీటుగా ఉండబోతుందనే చెప్పాలి. ఈ సినిమాలో అమలా పాల్ హీరోయిన్ కాగా.. సంగీతం అనిరుధ్ అందించాడు. జూలై 28 నాడు విడుదలకావలిసిన VIP2 ఆగష్టు మొదటి వారంలో విడుదల అవుతుంది.

,  ,  ,  ,  ,