Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2017 10:26:02
facebook Twitter Googleplus
Photo

అతిలోక సుందరి శ్రీదేవి ఈమధ్య తరచూ వార్తల్లోకొస్తోంది. వయసు పెరిగినా సొగసు తరగని హీరోయిన్ కావడంతో ఎక్కడికెళ్లినా కెమెరా కళ్లన్నీ ఆమెపైనే ఫోకస్ అవుతాయి. అదే తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒకే ఫ్రేమ్ లోకి వస్తే ఫ్లాష్ లైట్లన్నీ ఒకేసారి తళుకుమనాల్సిందే. గ్లామర్ హీరోయిన్లుగా క్లిక్ అయ్యేందుకు కావాల్సిన అన్ని ఫీచర్లూ పుష్కలంగా ఉన్న తన ఇద్దరు కూతుళ్లు జాన్వి - ఖుషీలతో కలిసి తాజాగా ఓ డిన్నర్ ప్రోగ్రాంకు అటెండయ్యింది. మెరుపు తీగల్లాంటి ఇద్దరు కుమార్తెలు చెరోపక్కా నడుచుకుంటూ వస్తున్న శ్రీదేవిని చూస్తే ర్యాంప్ వాక్ చేస్తూ రచ్చ చేస్తున్నట్లే అనిపించింది.

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి హీరోయిన్ అవుతుందని తెలిసిన విషయమే అయినా ఎప్పుడు ఎవరితో అన్నదే సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. మరాఠీ సినిమా సైరట్ రీమేక్ తో ఆమెను వెండితెరకు లాంచ్ చేయాలని ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. ఈ సినిమాను కరణ్ జోహార్ తీయనున్నాడు. సైరట్ సినిమాతో జాన్విని వెండితెరకు పరిచయం చేద్దామనే ప్రపోజల్ వచ్చిన మాటే వాస్తవమేనని కానీ ఇంకా ఈ ప్రాజెక్టు ఇంకా ఫైనల్ కాలేదని శ్రీదేవి భర్త బోనీ కపూర్ చెబుతున్నాడు.

అయినా శ్రీదేవితోపాటే వచ్చిన జాన్వి - ఖుషీల అప్పియరెన్స్ చూస్తే చూస్తుంటే అసలు సిసలైన గ్లామర్ డాల్స్ లా కనిపిస్తున్నారు.

,  ,  ,  ,