Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2016 12:26:02
facebook Twitter Googleplus
Photo

కమెడియన్లు హీరోలు కావడం కొత్తేం కాదు. ఆలీ దగ్గర్నుంచి సునీల్ వరకు చాలామంది హీరో వేషాలు వేశారు. రెండేళ్ల కిందట శ్రీనివాస రెడ్డి సైతం ?గీతాంజలి? సినిమాతో హీరోగా మారిపోయాడు. ఆ సినిమా అతడికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని ఇప్పడు హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీనివాసరెడ్డి. అతను హీరోగా.. పూర్ణ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ?జయమ్ము నిశ్చయమ్మురా?. శివరాజ్ కనుమూరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఓ బస్సు ప్రయాణం నేపథ్యంలో సాగే సినిమా ఇది.

ఆ మధ్య త్రివిక్రమ్ ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు. అది ఆసక్తి రేకెత్తించింది. ఆ తర్వాత మళ్లీ ఈ సినిమా వార్తల్లో లేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఓ అప్ డేట్ తో పలకరించాడు శ్రీనివాసరెడ్డి. ?జయమ్ము నిశ్చయమ్మురా? షూటింగుతో పాటు డబ్బింగ్ కూడా పూర్తయిందట. నవంబర్లో సినిమాను రిలీజ్ చేస్తారట. వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పూర్ణ.. శ్రీనివాసరెడ్డి వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్న పోస్టర్ అది. ఓ అబ్బాయి-అమ్మాయి కలిసి కరీం నగర్ నుంచి కాకినాడకు.. కాకినాడ నుంచి కరీంనగర్ కు ప్రయాణం చేసే క్రమంలో వాళ్లిద్దరి మధ్య ఎలాటి రిలేషన్ ఏర్పడిందో చూపించబోతున్నారు ఈ సినిమాలో. దర్శకుడు శివరాజే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. శ్రీనివాసరెడ్డి హీరోగా మరో సక్సెస్ కొడతాడేమో చూద్దాం.

,  ,  ,  ,