Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2017 16:00:20
facebook Twitter Googleplus
Photo

గోపీచంద్ తో చేసిన లక్ష్యం.. లౌక్యం మినహాయిస్తే శ్రీవాస్ కెరీర్లో మెరుపులేం లేవు. లక్ష్యం లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన శ్రీవాస్.. ఆ తర్వాత డౌన్ అయిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో లౌక్యం అతడికి లైఫ్ ఇచ్చింది. కానీ ఈ సినిమా తెచ్చిన పేరును శ్రీవాస్ తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు. నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో అతను చేసిన డిక్టేటర్ ఫ్లాప్ అయింది. దీంతో ఏడాదికి పైగా గ్యాప్ వచ్చేసింది. మధ్యలో గోపీచంద్ హీరోగా ఒక సినిమా అని.. ఇంకోటని ఏవో వార్తలొచ్చాయి కానీ.. అవేవీ వర్కవుట్ కాలేదు. ఐతే ఎట్టకేలకు శ్రీవాస్ ఒక సినిమా కమిటైనట్లు సమాచారం.

,  ,  ,  ,  ,