Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-May-2016 12:02:46
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం మొరాకో వెళ్లిన యూనిట్.. అక్కడ 8 కోట్ల రూపాయల ఖర్చుతో యుద్ధ సన్నివేశాలను కూడా చిత్రీకరించింది. రీసెంట్ గా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న శాతకర్ణి కోసం.. వచ్చే నెలలో మరుసటి షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పటివరకూ ఈ మూవీలో హీరోయిన్ ఎవరో ఫైనల్ కాలేదన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు బాలయ్య సరసన హీరోయిన్ గా నటించేందుకు శ్రియా శరణ్ ను సంప్రదిస్తున్నారని సమాచారం. 'ఇది ఒక రాణి పాత్ర. ఈ రోల్ ని చేసేందుకు పెర్ఫామెన్స్ చేయగల నటీమణులు కావాలి. అందుకే అనుభజ్ఞూలైన సీనియర్ హీరోయిన్ నే తీసుకునేందుకు ట్రై చేస్తున్నాం' అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చెన్నకేశవరెడ్డి చిత్రంలో బాలయ్యతో కలిసి నటించింది శ్రియ.

రీసెంట్ గా అయితే శ్రియ హీరోయిన్ గా నటించిన చివరి సినిమా గోపాలా గోపాలా. ఈ ఏడాది విడుదలైన ఊపిరిలోనూ కేమియో చేసింది ఈ సీనియర్ భామ. శ్రియను తీసుకుంటే డేట్స్ ప్రాబ్లెం ఉండదని ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం మూవీని పూర్తి చేయచ్చని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఓ భారీ షిప్ నిర్మాణం చేస్తున్నారు. దీనిలోనూ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

,  ,  ,  ,