Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2016 15:36:23
facebook Twitter Googleplus
Photo

సౌతిండియన్ సినిమాలో టాప్ హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోన్న తమన్నా, తాజాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ?అభినేత్రి? అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సుమారు 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ లేడీ ఓరియంటడ్ సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్‌కు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను ఆగష్టు 15న నిర్వహించనున్నట్లు టీమ్ తెలియజేసింది.
విజయవాడలో పెద్ద ఎత్తున జరిగే వేడుకలో ప్రముఖ నటి శ్రీదేవి చేతుల మీదుగా ఆడియో విడుదల చేపట్టనున్నట్లు ?అభినేత్రి? టీమ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఓ సరికొత్త కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినీ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోనూసూధ్ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,