Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2017 10:56:26
facebook Twitter Googleplus
Photo

పూర్వాశ్రమంలో లెక్కల మాస్టారు అవ్వడం మూలానో మరేంటో తెలియదు కానీ... సుకుమార్ తన సినిమాల్ని కూడా మెదడుకు పదును పెట్టేలా తీస్తుంటారు. ఆ వైనం ప్రేక్షకులకు కొత్తదాన్ని పంచింది. అయితే ఆ శైలి సుకుమార్ కి ఎంత ప్లస్సయిందో కొన్నిసార్లు అంత మైనస్ కూడా అయింది. మరీ ఇంటలెక్చువల్ గా తీశాడని అప్పుడప్పుడు కొన్నివర్గాల ప్రేక్షకులు పెదవి విరుస్తుంటారు. ఆయనకి ఫ్లాప్లు ఎదురయ్యాయంటే కారణం అందువల్లే అనేవాళ్లూ ఉన్నారు. 1 (నేనొక్కడినే) చూస్తున్నప్పుడు దాదాపుగా ప్రతి ప్రేక్షకుడికీ అదే అభిప్రాయం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత తీసిన నాన్నకు ప్రేమతో చిత్రం కూడా కాస్తో కూస్తో మెదడుకు పదును పెట్టేలానే ఉంటుంది.

అయితే తాజాగా రామ్ చరణ్ తో తీస్తున్న కొత్త సినిమా విషయంలో మాత్రం తన స్టైల్ ని పూర్తిగా మార్చి తీస్తున్నాడని సమాచారం. 1980ల నాటి కథతో తెరకెక్కుతున్న ఆ సినిమా మరీ ఇంటలెక్చువల్ గా కాకుండా సూటిగా ఉండబోతోందట. పల్లెటూరి నేపథ్యంతో కూడిన సినిమా కావడంతో సుక్కు పలు జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఆ సినిమాతో మరో కొత్త రకమైన సుకుమార్ ని చూస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే స్క్రీన్ ప్లే విషయం ఎలా ఉన్నా... స్టోరీ మాత్రం ఆయన శైలిలోనే కొత్తగా ఉండబోతోందట. దానిపై ముచ్చటపడే రామ్ చరణ్ ఒప్పుకొన్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి సుక్కు ఈసారి క్లాస్ మాస్ ఏ సెంటరు బి సెంటరు అనే తేడా లేకుండా అందరినీ హోల్ సేల్ గా మెప్పించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,