Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Feb-2017 10:17:25
facebook Twitter Googleplus
Photo

సినిమాకి హైప్ తీసుకురావడంలో టైటిల్ చాలా కీలకం. ఇప్పుడు చాలా సినిమాలు కనీసం నామకరణం చేసుకోకుండా షూటింగ్ చివరిదశకు కూడా వచ్చేస్తున్నాయి. అయితే వర్కింగ్ టైటిల్ పేరుతో పలు పేర్లను జనాల్లోకి తీసుకెళ్లడం.. వాటిలో నుంచి రియాక్షన్ బాగున్న పేరును ఎంచుకునే ట్రెండ్ కూడా నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్న మూవీ రెండు వారాల క్రితం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

వచ్చే నెల నుంచి రెగ్యులర్ షాటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి.. రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉండగా.. ఇప్పుడో కొత్త పేరు తెరపైకి వచ్చింది. అచ్చమైన పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించే కథ కావడం.. పాతికేళ్లకు ముందు 1990లలో జరిగిన కథను తీయనుండడం ఈ మూవీ స్పెషాలిటీ అయితే.. దీనికి రేపల్లె.. పల్లెటూరి మొనగాడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు టైటిల్ విషయంలో చెర్రీ ఓ క్లారిటీకి వచ్చేశాడట. మొగల్తూరు మొనగాడు అనే పేరు చెర్రీ అండ్ సుక్కు ఫిక్స్ అయిపోయారనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ లేదు కానీ.. ఈ టైటిల్ మాత్రం మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. మొగల్తూరు అంటే చిరంజీవి సొంత ఊరు అనే విషయం ప్రతీ మెగా అభిమానికి తెలిసిన విషయమే. అందుకే మొగల్తూరు మొనగాడు అనే టైటిల్ వినగానే ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ మొదలైపోతున్నాయి.

,  ,  ,  ,  ,  ,