Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jul-2017 11:06:13
facebook Twitter Googleplus
Photo

దర్శకుడి ప్రతిభను.. మరో దర్శకుడు పొగడడం అంటే చూసేందుకు భలే ఆసక్తిగా ఉంటుంది. అయితే.. ఇప్పుడున్న ట్రెండ్ లో ఒకరిని మించి ఒకరు సినిమాలు తీస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్.. పలు సినిమాలతో ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. తాజాగా జరిగిన ఫిదా ఆడియో లాంఛ్ కు అటెండ్ అయిన సుకుమార్.. ఫిదా దర్శకుడు సుకుమార్ గురించి చెప్పిన మాటలు ఆసక్తి కలిగించాయి.

సినిమా కంటే ముందు శేఖర్ కమ్ముల గురించి చెప్పాలి. తన మొహంపైనే ఓ ప్రేమకథ ఉంటుంది. తన నవ్వు.. మొహం అంత నిజాయితీగా ఉంటాయి. తన సినిమాలు చూస్తే ప్రేమ పుడుతుంది. నేను శేఖర్ ను చూసి ఒక విషయంలో బాగా జెలసీ ఫీలవుతుంటాను. పెద్ద సినిమాల్లో బాహుబలి ఎలా తియ్యలేనో.. చిన్న సినిమాల్లో హ్యాపీడేస్ లాంటి ఫీల్ గుడ్ మూవీ తీయలేను. అప్పట్లో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ మీరు కూడా హ్యాపీడేస్ లాంటి సినిమా తీయాలన్నాడు. నాకు సిగ్గనిపించింది. శేఖర్ లాగా రాద్దామనే ఉద్దేశ్యంతో 100పర్సెంట్ లవ్ రాశాను. కానీ రాస్తున్నకొద్దీ మళ్లీ నా లాజిక్ లోకి వెళ్లిపోయాను. మొత్తం మీద మళ్లీ నా టైమింగ్ లోకే వచ్చేసింది అన్నాడు సుకుమార్.

తను స్లో టెంపో ఉన్న సీన్ తీయాలని అనుకున్నా.. మంచి డైరెక్షన్ చేయాలని అనుకున్నా.. శేఖర్ కమ్ముల సినిమాలు చూస్తుంటానని సుకుమార్ లాంటి దర్శకుడు చెప్పడం.. ఫిదా ఆడియా లాంఛ్ ఈవెంట్ కే హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.

,  ,  ,  ,  ,  ,  ,