Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2017 16:51:43
facebook Twitter Googleplus
Photo

యాంకర్ సుమ ఎంత చలాకీ అనే విషయం చెప్పాల్సిన పని లేదు. స్పాంటేనియస్ గా సుమ పేల్చే పంచ్ లు.. కామెడీ ఆమెను టాప్ యాంకర్ స్థాయికి చేర్చాయి. ఏ సినిమా సంబంధిత ఫంక్షన్ అయినా.. సుమకే మొదటి పిలుపు అందడానికి కారణం ఇదే.

ఇక టీవీ షోస్ లో అయితే సుమ చేసే హంగామాకు అంతే ఉండదు. అలాగని సుమ ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించినట్లుగా మాట్లాడినట్లుగా కనిపించదు. కానీ మొదటిసారిగా ఇలాంటి సంఘటన జరిగిందట. తాజాగా బాబు బాగా బిజీ టీం అంతా సుమ హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమానికి వచ్చారు. ఇందులో భాగంగా ఓ హీరోయిన్ మిస్తీ చక్రవర్తితో మాట్లాడుతూ.. నీ పేరు ముష్టినా అని అడిగిందట సుమ. ఈ దెబ్బతో అక్కడున్నవాళ్లంతా నవ్వేశారట. మొదట ఏమీ అర్ధం కాకపోయినా.. తర్వాత దీనికి అర్ధం బెగ్గింగ్ అంటూ పక్కనోళ్లు వివరించారట.

దీనికి కొంచెం ఫీల్ అయినా.. తన మొహంపై ఏ మాత్రం చిరునవ్వు పోకుండా ప్రోగ్రామ్ కంటిన్యూ చేసిందట మిస్తీ చక్రవర్తి. అయితే.. తన తప్పును గ్రహించిన సుమ.. షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ హీరోయిన్ కి సారీ చెప్పిందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,