Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Dec-2017 10:53:21
facebook Twitter Googleplus
Photo

నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుమంత్ కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలే చేశాడు. తరవాత వరస ఫ్లాపులతో చాలారోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడు. లాంగ్ గ్యాప్ తరవాత హిందీ హిట్ సినిమా వికీ డోనర్ రీమేక్ నరుడా.. డోనరుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత సైలెంట్ గా ఉన్న సుమంత్ మళ్ళీరావా అనే సినిమా కంప్లీట్ చేసి ట్రయిలర్ కూడా రిలీజ్ చేశాడు. ఒక ఫీల్ గుడ్ ఫిలిం తరహాలో ఉన్న మళ్లీ రావా ట్రయిలర్ బాగానే ఆకట్టుకుంది.

కొత్త దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మళ్ళీరావా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా చేయడానికి తనను డైరెక్టర్ గౌతమ్ అప్రోచ్ అయినట్లుగా ఇంతవరకూ ఎవరూ అవలేదని చెప్పుకొచ్చాడు సుమంత్. డైరెక్టర్ వచ్చి ఈ సినిమా కథ మొత్తం చెప్పాక కళ్లల్లో నీళ్లొచ్చేశాయి. అంతేకాదు. ఈ సినిమాకు సంబంధించి ఓ టెస్ట్ రీల్ లాగా కొన్ని సీన్లు డైరెక్ట్ చేసి తీసుకొచ్చి చూపించాడు. 22 సినిమాలు చేశాను. గోదావరి.. గోల్కొండ హైస్కూల్ తరవాత అంత పకడ్బందీ స్క్రిప్ట్ తో చేసిన సినిమా ఇది. సినిమాలో కొన్ని సన్నివేశాలు షూట్ చేసి అయితే ఎవరూ తీసుకురాలేదు. ఈ సినిమా షూటింగ్ 30 రోజుల్లో పూర్తి చేశాం.. చాలామంది చుట్టేశాం అనుకోవచ్చు. కానీ 10 నెలలు ప్రీ ప్రొడక్షన్ పై వర్క్ చేశాక షూటింగ్ మొదలెట్టాం. నిర్మాత రాహుల్ యాదవ్ కు అవసరమైన సహాయం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అవసరమైన సలహాలు ఇస్తామన్నా ఆ అవసరం లేకుండా పని పూర్తి చేశారు. నేను ఆయన దగ్గర సలహాలు తీసుకోవాలంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా చేయడం వెనుక ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చాడు సుమంత్.

మళ్ళీరావా సినిమా లో హీరోయిన్ గా ఆకాంక్ష టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ఆమె బ్యూటిఫుల్ - టాలెంటెడ్ మాత్రమే కాదు.. చాలా ప్రొఫెషనల్ కూడా అని కితాబిచ్చాడు.

,  ,  ,  ,  ,