Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Dec-2017 12:06:14
facebook Twitter Googleplus
Photo

సుమంత్ లో మళ్లీ ఉత్సాహం కనిపిస్తోంది. సినిమాల సంఖ్యలో సక్సెస్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న హీరోల్లో ఒకడైన సుమంత్.. రీసెంట్ గా మళ్లీ రావా మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. గత వారంలో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు రెండో వారంలో కూడా తగినన్ని స్క్రీన్లలోనే ప్రదర్శితం అవుతోంది.

పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా చేసిన సుమంత్ అండ్ టీం.. ఇప్పుడు కొంత రిలీఫ్ అయ్యారనే చెప్పాలి. మరోవైపు విజయం అందించిన హుషారును ఆస్వాదిస్తున్నాడు కూడా. అయితే.. రీసెంట్ గా సుమంత్ పోస్ట్ చేసిన ఓ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. న్యూస్ పేపర్ లోని పేజ్ ను ఈ హీరో పోస్ట్ చేశాడు. ఇందులో మళ్లీ రావా మూవీ రెండో వారం ప్రదర్శిస్తున్న థియేటర్ల లిస్ట్ ఉండగా.. ఆ పక్కనే ఈ నెల 22న విడుదల అవుతున్న అఖిల్ మూవీ హలో చిత్రానికి సంబంధించిన లిస్ట్ కూడా ఉంటుంది.

ఇలా పక్కపక్కనే రెండు సినిమాల పోస్టర్లను చూసిన తన సోదరి మొహంలో చిరునవ్వులు చూడముచ్చటగా ఉన్నాయని చెప్పాడు సుమంత్.

,  ,  ,  ,  ,