Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2016 12:51:24
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య కాలంలో అసలు హిట్టంటూ లేని దర్శకుడు కృష్ణవంశీ.. ఒకానొక టైమ్ లో మురారి వంటి సినిమాతో రచ్చ లేపేశాడు. ఇప్పటికీ రొమాన్స్ అండ్ ఫ్యామిలీ ట్రీట్మెంట్ అంటే అందరూ ఓసారి ఆ సినిమా రీ-విజిట్ చేస్తారంతే. అయితే ఇప్పుడు ఒక అనవసరమైన విషయానికి కూడా మురారి సినిమాను గుర్తుకుతెస్తున్నారు కొందరు జనాలు.

గురువుగారి కొత్త సినిమా ''నక్షత్రం'' షూటింగ్ మొన్ననే మొదలైంది. అయితే పని మొదలు పెట్టిన రోజునే.. రక్తం చిందించారు. హీరో సందీప్ కిషన్ తలకు గాయమైంది. ఏకంగా 12 కుట్లు వేస్తేనే కాని మనోడికి సెట్టవ్వలేదు. పైగా వారంపాటు షూటింగ్ ను వాయిదా వేయాల్సి కూడా వచ్చింది. అదేదో ''మురారి'' సినిమాలో రక్తాతర్పణం జరగాల్సిందే అన్నట్లు.. ఈ సినిమా మొదలైన రోజునే ఇలా దెబ్బతగిలి రక్తం కారడం అనే విషయం గురించి ఇప్పుడు ఫిలిం నగర్ లో వాల్యూమ్్స వాల్యూమ్స్ గా డిస్కస్ చేస్తున్నారు జనాలు. అక్కడ మహేష్ తన రక్తంతో ఒక విగ్రహానికి అభిషేకం చేశాడు.. ఇక్కడ సందీప్ రియల్ గా కెమెరాకు అలాంటి అభిషేకమే చేశాడు అంటూ జోకులు వేస్తున్నారు జనాలు.

ఇకపోతే సందీప్ స్నేహితులు మాత్రం.. రక్తాభిషేకంతో మొదలైంది కాబట్టి.. ప్రాజెక్టు పెద్ద హిట్టవుతుందని అంటున్నారట. సరిగ్గా జాగ్రత్తలు పాటించి సినిమాలు తీయాలి కాని.. ఇలా దెబ్బలు తగలగానే మురారి గుర్తొచ్చి అభిషేకం సెంటిమెంట్ అనుకోవడం ఏంటో!!

,  ,  ,  ,  ,  ,