Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2017 16:02:24
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు గౌతమ్ మీనన్ ది ఓ విలక్షణ శైలి. దర్శకుడిగా గౌతమ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసినవసరం లేదు. గౌతమ్ మీనన్ నిర్మాతగానూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ వెర్సటైల్ డైరెక్టర్ నిర్మాణంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడు. డి 16 సినిమాను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో నరగాసురన్ అనే సినిమా రాబోతోంది. తెలుగులో నరకాసురుడు గా రాబోతున్న ఈ సినిమాలో సందీప్ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. మానగరం సినిమాతో కోలీవుడ్ కు సందీప్ సుపరిచితుడే. నరకాసురుడిలో సందీప్ కిషన్ రోల్ సినిమాకే హైలైట్ అవుతుందని కోలీవుడ్ టాక్.

గౌతమ్ మీనన్ .. కార్తీక్ నరేన్ కాంబినేషన్ కారణంగా నరకాసురుడు సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత సందీప్ కిషన్ హీరోగా మరో సినిమాను నిర్మించాలని గౌతమ్ మీనన్ అనుకుంటున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కనుంది. నటుడిగా మంచి పర్ ఫార్మన్స్ ఇస్తున్నా...హిట్ సినిమాలు లేక సందీప్ సక్సెస్ అందుకోలేక పోతున్నాడు. శమంతకమణి చిత్రం ఫరవాలేదనిపించినా తాజాగా వచ్చిన నక్షత్రం సినిమా సందీప్ కెరీర్ లో ఓ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో గౌతమ్ మీనన్ సినిమాల మీద గంపెడాశలు పెట్టుకున్నాడు సందీప్.

,  ,  ,  ,  ,