Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2017 12:00:27
facebook Twitter Googleplus
Photo

కామెడీ హీరో సునీల్ కొత్త సినిమా వస్తోంది. ఈ మధ్య మనోడి సినిమాలు అన్నీ డిజప్పాయింట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఉంగరాల రాంబాబు చేస్తున్నాడని తెలిసినా.. పెద్దగా ఆసక్తి జనరేట్ కాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన పాట పోస్టర్ ని చూస్తే మళ్ళీ సునీల్.. తన స్టైల్ కామెడీతో అందరినీ నవ్విస్తాడనే అంచనాలు ఏర్పడుతున్నాయి. మొదటి పాట విడుదల సందర్భంగా సునీల్ అనేక సంగతులు చెప్పి ఊరిస్తున్నాడు.

“ఉంగరాల రాంబాబు అంటూ మంచి కామిడీతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా కథను.. నన్ను నమ్మి పరుచూరి కిరీటి గారు ఒక చక్కటి ఫ్యామిలి కామిడీ సినిమా చేయడానికి సిద్ధపడ్డందుకు చాలా థ్యాంక్స్. అంతేకాకుండా నాకు ఈ సినిమా ద్వారా ఎప్పూడూ దక్కని కొత్త అవకాశం వచ్చింది.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారితో సినిమా ఆద్యంతం నటించే అదృష్టం దక్కింది. అలాగే ఉంగరాల రాంబాబు మొదటి పాట 'హూ లా హూ లా' ను దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి అంకితం చేస్తున్నాము" అని చెప్పాడు సునీల్. ఈ సినిమాలో పాటలన్నీ ఒకేసారి కాకుండా వారానికి ఒకటి చెప్పున యూట్యూబ్ ద్వారా విడుదల చేయనున్నట్లు సునీల్ తెలిపాడు.

ఉంగరాల రాంబాబు చిత్రాన్ని క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేయగా.. పరిచూరి కిరీటి నిర్మాణంలో రూపొందుతోంది. ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందించాడు.

,  ,  ,  ,