Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2016 11:16:16
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య బంగార్రాజు బాగా ఫేమస్ అయిపోయింది. సోగ్గాడే చిన్నినాయనలో నాగార్జున బంగార్రాజుగా ఇరగదీసేశాడు.. త్వరలో అదే టైటిల్ తో ప్రీక్వెల్ కూడా చేస్తున్నాడు. కానీ ఇక్కడమ మనం సునీల్ బంగార్రాజు గురించి చెప్పుకుంది. ఈడు గోల్డె ఎహె అనే టైటిల్ తో.. మన ముందుకు వచ్చేస్తున్నాడు సునీల్. అక్టోబర్ 7న విడుదల కానున్న ఈ మూవీ టైటిల్ వెనక స్టోరీని సునీల్ విప్పేశాడు.

'ఈ సినిమాలో నా పాత్ర పేరు బంగార్రాజు. అలా గోల్డ్ టైటిల్ లో చేరగా.. ఎహె అనేది నా మేనరిజం. ఈ సినిమా విడుదలయ్యాక ఎహె అన్న పదం చిన్నా పెద్దా అందరికీ నోటిలో నానడం ఖాయం' అంటున్నాడు సునీల్. అయితే.. తాను గత కొంత కాలంగా కేవలం కామెడీ మూవీస్ మాత్రమే చేస్తున్నానని.. ఈ సినిమాలో కూడా కామెడీ పుష్కలంగా ఉన్నా.. సస్పెన్స్ ని రివీల్ చేయకుండా ఆఖరి సీన్ వరకూ కంటిన్యూ చేయడం.. ఈ సినిమాలో అసలు హైలైట్ అంటున్నాడు సునీల్.

'పూల రంగడు.. భీమవరం బుల్లోడు.. జక్కన్నలు కమర్షియల్ కామెడీ ఎంటర్టెయినర్స్. కానీ ఈడు గోల్డ్ ఎహెలో మాత్రం నెక్ట్స్ సీన్ లో ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి వల్లా కాదు. చివరి సీన్ వరకూ ఈ థ్రిల్ కంటిన్యూ అయ్యేలా తీసిన దర్శకుడు వీరు పోట్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే' అంటున్నాడు సునీల్. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నా ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్ అని చెప్పడం విశేషం.

,  ,  ,  ,  ,