Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jul-2017 12:47:24
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో సినిమాల పాటలన్నీ ఒకేసారి ఆడియో లాంచ్ రోజున లాంచ్ చేసేయకుండా.. చక్కగా మనోళ్ళు ముందే సాంగ్ టీజర్లను.. పూర్తి సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తున్నారు. ఆ విధంగా ఆడియో లాంచ్ కార్యక్రమం మొదలయ్యేనాటికే మనోళ్ళు చక్కగా పాటలన్నీ జనాల్లోకి ఎక్కించేస్తున్నారు. ఇప్పుడు నితిన్ కూడా తన కొత్త సినిమా లై పాటలను ఇదే పద్దతిలో దించుతున్నాడు.

ఈ సినిమా నుండి ఆల్రెడీ తెలంగాణ యాసలో మణిశర్మ కంపోజ్ చేసిన బొంబాట్ అనే సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడిక రెండో పాట మిస్ సన్ షైన్ బయటకు వచ్చింది. ఈ పాట కమ్మగా నిధానంగా సాగే మెలోడి. చక్కటి గిటార్ వర్కుతో మణి బాగానే ఇంప్రెస్ చేశాడు. అలాగే నితిన్ అండ్ మేఘా ఆకాష్ ఫోటోలు కూడా ఈ లిరికల్ వీడియోలో భలే చూడముచ్చటగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మెలోడీలకు బొత్తిగా దూరమైన స్వరబ్రహ్మ.. ఇప్పుడు మరోసారి తన స్థాయి ఏంటో చూపించే ప్రయత్నం చేశాడు.

ఇక్కడవరకు బాగానే ఉంది కాని.. ఎందుకో ఈ పాటలో ఒక హింది సాంగ్ ఛాయలు కనిపిస్తున్నాయి. యో యో హనీ సింగ్ కంపోజ్ చేసిన బ్లూ ఐస్ పాటను ఒకసారి వింటే.. ఈ పాటకు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. మేబీ ఆ పాటలోనూ ఈ పాటలోనూ గిటార్ స్ర్టమ్మింగ్ ఒకేలా ఉండటం కారణంగానేమో. లేదంటే అదే శృతిలో అదే బీట్ లో నిధానంగా ఒకేలా సాగడం కారణంగానేమో.

,  ,  ,  ,  ,