Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-May-2016 13:28:44
facebook Twitter Googleplus
Photo

ఒక తెలుగు హీరకు అన్నింటికంటే ఎక్కవుగా తెలుగు రాష్ట్రంలలోనే కలెక్షన్లు వస్తాయి. పక్క రాష్ట్రంలలో తక్కువగానే వసూళ్లుంటాయి. కాని హీరో సూర్య మాత్రం అందుకు భిన్నంగా వసూలు చేస్తున్నాడు. తన కొత్త సినిమా ''24'' కలెక్షన్ల పర్వం చూస్తే ఆ విషయం మనకు అర్ధమవుతుంది.

తమిళంలో విడుదలైన ''24'' సినిమా 4.46 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే.. తెలుగు రాష్ట్రంలలో విడుదలైన తెలుగు వర్షెన్ కూడా 4.42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ లెక్కన చూస్తే.. తమిళ వెర్షన్ కంటే తెలుగులోనే ఎక్కువగా వచ్చినట్లు మరి. ఇక్కడే ఎక్కువమంది సూర్యను ఆదరిస్తున్నారని చెప్పాలా? లేకపోతే ఇక్కడి ఆడియన్స్ కు సూర్య ''24'' బాగా నచ్చిందని చెప్పాలా అనే విషయం మొదటి వారం నాటి కలక్షన్లు చూస్తే మనకు అర్దమవుతుంది. ప్రస్తుతం సూర్య కూడా తెలుగు వారు తనపై కురిపిస్తున్న అభిమానం చూసి స్టన్ అయిపోతున్నారట.

అయితే.. ఇదే రేంజు అభిమానం మరి మన తెలుగు హీరోలు తమిళనాటు కూడా సంపాదించుకుని.. ఇక్కడితో పోటీగా అక్కడ కూడా కలక్షన్లు వసూలు చేస్తారని ఆశిద్దాం.

,  ,  ,  ,  ,