Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 10:31:11
facebook Twitter Googleplus
Photo

హాట్ యాంకర్ అనసూయ మళ్లీ ఆన్ స్క్రీన్ పై మెరుపులకు సిద్ధమైంది. గతేడాది సోగ్గాడే చిన్ని నాయనా.. క్షణం మూవీస్ లో మెరిసిన ఈ హాటీ.. ఇప్పుడు విన్నర్ మూవీలో ఐటెం సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. విన్నర్ మూవీ సాంగ్స్ ను స్టార్స్ సెలబ్రిటీలతో విడుదల చేయిస్తోంది యూనిట్.

ఇప్పుడు సూయా సుయా అనసూయా అంటూ సాగే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఫారిన్ లొకేషన్ లో పబ్ థీమ్ తో రూపొందించిన ఆ పాటలో హాటీ అనసూయ కుమ్మేసినట్లుగా కనిపిస్తోంది. జస్ట్ ఫోటోల వరకే చూపించినా అనసూయ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అర్ధమవుతుంది. అనసూయ ఈ విషయంలో ఓ సెన్సేషనల్ రికార్డ్ సృష్టించేసింది. ఈ భామకు ఇదే మొదటి ఐటెం సాంగ్. అయినా సరే.. ఆమె పేరు మీదే ఓ లిరిక్ రాయించి మరీ సినిమాలో పెట్టేశారంటే.. హాటీ క్రేజ్ అర్ధమవుతుంది. ఐటెం సాంగ్స్.. అదే అనసూయ భాషలో స్పెషల్ సాంగ్స్ కు వ్యతిరేకం అని గతంలో చెప్పేది. పాటతో పాటు తనకు కేరక్టర్ ఉంటే గానీ చేయనని పట్టుపట్టేది.

కానీ ఇప్పుడు మాత్రం అదే టైపు పాటలో రెచ్చిపోయి చేసేయడం ఆశ్చర్యకరమే అయినా.. ఐటెం పాటలో అరంగేట్రంలోనే అదరగొట్టేట్లుగా ఉంది. అనసూయ గెటప్ గట్రా చూస్తుంటే.. పక్కా లోకల్ అంటూ పాటేసుకున్న కాజల్ కి కూడా ఈ విషయంలో పోటీ ఇచ్చేట్లుగానే ఉంది.

,  ,  ,  ,  ,