Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-May-2015 11:20:20
facebook Twitter Googleplus
Photo

వెండితెరపై మీగడ తరకలా కనిపించే తాప్సీ, గ్లామర్ అనే మాటకు కొలమానంగా నిలిచింది. అందమైన లొకేషన్లలో .. ఆహ్లాదకరమైన వాతావరణంలో పాటలు పాడుకోవడానికి మాత్రమే పనికి వచ్చేలా కనిపించే ఈ సుకుమారి, త్వరలో పోలీస్ అధికారిణిగా ప్రేక్షకుల ముందుకి రానున్నట్టు తెలుస్తోంది. శింబూ కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కాన్' చిత్రంలో ఆమె ఈ పాత్రలో కనిపిస్తుంది. అడవీ నేపథ్యంలో ఈ సినిమా ఆసక్తికరంగా కొనసాగుతుంది.

ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అడవి సంబంధమైన సన్నివేశాల్లో తాప్సీ పాత్ర కీలకంగా నిలుస్తుంది. ఈ పాత్ర ఒక నటిగా తనకి మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందని తాప్సీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. శారద .. విజయశాంతి పోలీస్ అధికారిణి పాత్రలను అద్భుతంగా పోషించి అనూహ్యమైన స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. మరి ఈ పాత్రలో ప్రేక్షకులను తాప్సీ ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలానే కుతూహలం అభిమానులకు కలగడం ఖాయం.

,  ,  ,  ,