Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 15:56:47
facebook Twitter Googleplus
Photo

కథానాయికలు వాళ్ల కెరీర్‌ పరంగా ఒకొక్కరు ఒక్కో వ్యూహంతో ముందుకెళుతుంటారు. దర్శకులు కథతో రాగానే కొద్దిమంది స్టార్‌ కథానాయికలు ?నా పనితీరు ఇలా ఉంటుంది. ఇవీ నా పరిమితులు? అంటూ చిట్టా విప్పుతుంటారు. అందుకు ఒప్పుకొన్నాకే కథలు వింటుంటారు. వాళ్లు ఏం చేసినా ఓ లెక్క ఉంటుందన్నమాట. తమన్నా మాత్రం ?నాక్కూడా లెక్కలుండొచ్చు కానీ... అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయ?ని చెబుతోంది. ??కథకే నా తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే మిగతా విషయాలు. నటీనటులతో ఎప్పుడైనా ఏమైనా చేయించే సత్తా కథలకి ఉంటుంది. ఫలానా పాత్రలంటే నాకు ఇష్టం లేదని, తెరపై ఇలా మాత్రమే కనిపిస్తానని ఇప్పుడు నేనూ చెప్పొచ్చు. కానీ రేపు బలమైన కథ విన్నాక అది నా నిర్ణయాన్ని మార్చుకొనేలానూ చేయొచ్చు. అందుకే కథ వినేంత వరకు నా అభిప్రాయమేదీ చెప్పను. ఈ వ్యూహం మంచి ఫలితాల్నే ఇచ్చింద??ని సెలవిచ్చింది తమన్నా. ప్రస్తుతం ఆమె ?బాహుబలి - ది కన్‌క్లూజన్‌?, ?అభినేత్రి? చిత్రాల్లో నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,