Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Sep-2017 11:08:04
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్యన అంత కావడం లేదు. మన సినిమాలనే బాలీవుడ్ హీరోలు ఏరి కోరి మరి ఎంచుకుంటున్నారు. అంతే కాకుండా మన దర్శకులు కూడా ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. రచయితగా మంచి ప్రతిభను కనబరుస్తూ అద్భుతమైన కథలని ఇస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత తెలుగు దర్శకుడిని ఆకర్షించింది. ఆ సినిమా మరేదో కాదు. బాలీవుడ్ డేర్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమా.

బాలీవుడ్ లో ఆ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. కేవలం 12 కోట్లతో తెరకెక్కి 100 కోట్లను రాబట్టింది. ఒక హీరోయిన్ నటించిన సినిమా ఆ స్థాయిలో బాక్స్ ఆఫీస్ రికార్డుల్లోకెక్కడం తొలిసారి. అయితే ఆ సినిమాను ఇప్పటికే తమిళ్ - మలయాళం - కన్నడ లో తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగులో కూడా ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీర్చిదిద్దెందుకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ కొన్ని రోజుల వరకు కసరత్తులు చేశాడు. ఈ తెలుగు కథలో క్వీన్ గా తమన్నా నటించబోతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇదివరకే చెప్పినా.. తమన్నా మాత్రం సినిమా గురించి ఏమి మాట్లాడలేదు. అయితే రీసెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మిల్కి బ్యూటీ క్వీన్ స్టోరీపై స్పందించింది.

ఆ కథ అంటే తనకు చాలా ఇష్టమని మహిళకు స్ఫూర్తినిచ్చే అలంటి సినిమాలను తియ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు ఉందని చెబుతూ.. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. మొదటిసారి నీలకంఠ గారి దర్శకత్వంలో నటించబోతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉందని తెలిపింది.

,  ,  ,  ,