Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2016 14:35:35
facebook Twitter Googleplus
Photo

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. అభినేత్రి అనే టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. ప్రభుదేవాకి జంటగా నటిస్తున్నా.. స్టోరీ మొత్తం తమ్మూ చుట్టే తిరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన ఇప్పటికే విడుదల కొన్ని ఫోటోస్.. అభిమానులను తెగ కలవరపెట్టేశాయి. మిల్కీని ఫుల్లుగా డీగ్లామర్ గా చూపించేసి.. ఇంట్లో పనిమనిషి గెటప్ లో చూపించేయడం చాలామంది అభిమానులకు మింగుడు పడలేదు.

పోష్ లుక్ కి కేరాఫ్ అడ్రస్ లా ఉండే తమన్నాని ఇలా చూడాల్సి వచ్చేసరికి చాలామంది ఫ్యాన్స్ తెగ ఫీలయిపోయారు. నిజానికి ఈ సినిమాలో తమ్మూ రోల్ లో ఇంకో వేరియేషన్ ఉంటుంది. అభినేత్రి అంటేనే యాక్ట్రెస్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఆ పనమ్మాయి స్థాయి నుంచి ఓ హీరోయిన్ గా మారిన అమ్మాయి స్టోరీ అని తెలుస్తోంది. అలా హీరోయిన్ అయిపోయాక ఎలా ఉంటుందో ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. గోల్డ్ కలర్ ఔట్ ఫిట్స్ తో.. సహజంగా తమ్మూ చూపించే గ్లామర్ కి ఒకడుగు ముందే ఉన్నట్లు అనిపించడం లేదు.

మామూలుగా తమ్మూ షార్ట్ లెంగ్త్ వేస్తుంది కానీ... ఈ ఫోటోలో ఆ డ్రస్ మరికాస్త తగ్గిన విషయం గమనించచ్చు. మరి హీరోయిన్ తమ్మూ అంటే గ్లామర్ డోస్ బాగా ఉంటుంది కదా. అలా అభినేత్రిలో అందాల ప్రదర్శన సాధారణ స్థాయికి మించే ఉంటుందని అంటున్నారు. కాకపోతే ఇవేమీ ఇప్పుడే రివీల్ చేసే ఉద్దేశ్యం లేదట. ఆడియన్స్ ని థియేటర్లో మెస్మరైజ్ చేసే కాన్సెప్ట్ తోనే దర్శకనిర్మాతలు ఇలాంటి ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. మరి డీగ్లామర్ తమ్మూతో పాటు.. అల్ట్రా గ్లామరస్ మిల్కీని చూసేందుకు అభిమానులు రెడీ అయిపోవచ్చు.

,  ,  ,  ,  ,  ,