Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2016 13:46:10
facebook Twitter Googleplus
Photo

మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ ను చూపేందుకు దర్శక నిర్మాతలు తెగ ప్రయత్నించేస్తుంటారు. కేవలం మిల్కీ అందాలనే ప్రొజెక్ట్ చేసి.. థియేటర్లకు జనాలను రాబట్టిన సినిమాలు బాగానే ఉంటాయి. అందుకే తమ్మూతో ఓ ఐటెం సాంగ్ చేయించి సినిమాలో పెట్టేస్తుంటారు. ఇక బెంగాల్ టైగర్ లాంటి మాస్ మూవీకి కూడా తమ్మూ గ్లామర్ గా అండగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఒక్కడొచ్చాడు అంటూ విశాల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ మూవీ కత్తి సాందాయ్ తో పాటే తెలుగు వెర్షన్ ను కూడా నవంబర్ 18నే రిలీజ్ చేయబోతున్నారు. విశాల్ కి టాలీవుడ్ లో కూడా ఇమేజ్ ఉన్నా.. ఇప్పుడున్న సిట్యుయేషన్ లో తమన్నాను నమ్ముకోవడమే బెస్ట్ అని ఫిక్స్ అయిపోయారు నిర్మాతలు. అందుకే ఆడియో రిలీజ్ పోస్టర్లలోనే తమ్మూ అందాలను హైలైట్ చేస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టర్లతో రచ్చ రచ్చ చేసేశారు.

చిట్టి పొట్టి బట్టలు వేసుకని.. తమన్నా డ్యాన్స్ చేస్తున్న పోస్టర్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలన్న ప్రొడ్యూసర్ల టార్గెట్ వర్కవుట్ అయినట్లుగానే ఉంది. ఈ పాల సొగసుల సుందరికి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంతో.. అమ్మడి సొగసులను ఆన్ స్క్రీన్ పై చూపేందుకు బోలెడంత మంది ఉత్సాహం చూపించేస్తుంటారు. ఒక్కడొచ్చాడుకు కూడా అదే రూట్ పట్టక తప్పలేదు.

,  ,  ,  ,  ,