Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2016 15:21:58
facebook Twitter Googleplus
Photo

తాను చేసిన చిత్రాలలో దాదాపు ఎనభై శాతం విజయాలతో ఇండస్ట్రీలో ప్రస్తుత తరం లాంగ్ రన్ లో కొనసాగుతున్న టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ అమ్మడుకి ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ ద్వారా ఫ్లాప్ వచ్చినా ఆ షేడ్ కెరీర్ మీద పడకుండా బ్రహ్మోత్సవం ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుంది.

అయితే ఇండస్ట్రీలో తాను నిలదొక్కుకోవడానికి ఇద్దరు గాడ్ ఫాదర్ లలో ఒకరిగా భావించే తేజ దర్శకత్వంలో సంతకం చేసిన సంగతి తెలిసినదే. హీరోయిన్ ఓరియెంటెడ్ గా సాగే ఈ సినిమా కోసం తానూ ఎప్పటినుండో ఎదురుచూస్తుంది.

అయితే ఎంతటి సెలబ్రిటీ అయినా తేజాకి ఒకటే. సినిమా మొదలుకావడంతోనే కాజల్ ని కాస్త ఒళ్ళు తగ్గించమని సంకేతాలు జారీ చేసినట్టు సమాచారం. ఇలాంటి విషయాలలో హీరోయిన్లను ఎక్కువ ఇబ్బంది పెడతాడనే వాదన తేజపై వున్నా అంతా తను అనుకునే అవుట్ పుట్ కోసమే అన్నది అతని భావన.

,  ,  ,  ,  ,  ,  ,