Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2016 11:33:59
facebook Twitter Googleplus
Photo

అమెరికాలో విడుదలవడమే గొప్ప అనుకునే స్థితి నుంచి అక్కడ పది కోట్లకు పైగా బిజినెస్ చేసే స్థాయికి వచ్చాయి తెలుగు సినిమాలు. యుఎస్ లో మన హీరోల మార్కెట్ రోజు రోజుకు విస్తృతం అవుతోంది. బాలీవుడ్ సినిమాలకు దీటుగా మనోళ్ల సినిమాలు బిజినెస్ చేస్తున్నాయి. అందులోనూ ఈ సమ్మర్లో వచ్చిన సినిమాల మీద అమెరికా డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు.

ఐతే సమ్మర్ సినిమాలు వరుసగా యుఎస్ డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ముందుగా సర్దార్ గబ్బర్ సింగ్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది యుఎస్ బయ్యర్లకు ఆ సినిమా 1 మిలియన్ డాలర్లకు కాస్త ఎక్కువ మాత్రమే వసూలు చేసింది. దీంతో బయ్యర్ బాగానే నష్టపోయాడు. ఆ తర్వాత సరైనోడు షాకిచ్చింది. డొమెస్టిక్ లెవెల్లో భారీగానే వసూలు చేసినా అమెరికాలో మాత్రం ఆ సినిమా మిలియన్ క్లబ్ కూడా టచ్ చేయలేదు.దాని బయ్యర్లు స్వల్ప నష్టాలతో బయటపడ్డారు.

పై రెండు సినిమాలూ మాస్ టైపు కాబట్టి.. ఆ తరహా సినిమాలు యుఎస్ ఆడియన్స్ కు అంతగా నచ్చవు కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ యుఎస్ ప్రేక్షకులకు పర్ఫెక్ట్ అనుకున్న బ్రహ్మోత్సవం కూడా పెద్ద దెబ్బే కొట్టింది. ప్రిమియర్ల నుంచే బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటిదాకా 1.5 మిలియన్ డాలర్లే వసూలు చేసింది. బ్రహ్మోత్సవం బయ్యర్ సేఫ్ కావాలంటే 2.7 మిలియన్ల దాకా వసూలు చేయాలి. కానీ పరిస్థితి చూస్తుంటే అది అసాధ్యమనే అనిపిస్తోంది.మరి రాబోయే ?అ..ఆ' ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,