Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2017 10:36:17
facebook Twitter Googleplus
Photo

జెట్ స్పీడ్ తో దూసుకొచ్చాడు ఎస్ ఎస్ థమన్. ఆరంభంలోనే టాప్ హీరోల సినిమాలను అందుకుని ఆశ్చర్యపరిచాడు. భారీ సినిమాలకు.. స్టార్ హీరోలకు మ్యూజిక్ కంపోజ్ చేసినా.. చిరకాలం నిలిచిపోయే పాటలు అందించే విషయంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి. అలాగని తమన్ కెరీర్ కు వచ్చిన లోటేమీ లేదు.

ఎందుకంటే ఈ కంపోజర్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ గా ఉంటుంది. నిన్న తమన్ సంగీతం ఇస్తున్న రెండు సినిమాలకు టీజర్స్ రిలీజ్ అయ్యాయి. అనుష్క నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ భాగమతి ఒకటైతే.. రెండోది వరుణ్ తేజ్-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న తొలిప్రేమ. అటు హారర్ జోనర్ లో మూవీకి.. ఇటు ప్యూర్ లవ్ స్టోరీకి.. రెండింటికి అదిరిపోయే బీజీఎం కొట్టాడు తమన్. విభిన్నమైన జోనర్లలోని సినిమాలకు.. వాటి థీమ్ కు సరిపోయే విధంగా ఇచ్చిన సంగీతం బాగా ఆకట్టుకుంటోంది.

అయితే.. పాటల విషయంలో మాత్రం తమన్ ఇంకా శ్రోతలకు చాలానే బకాయి పడిపోయాడు. భాగమతి.. తొలిప్రేమలపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిలో అయినా పాటలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి తనపై ఉన్న విమర్శలకు చెక్ పెడతాడో లేదో చూడాలి.

,  ,  ,  ,  ,  ,