Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Oct-2017 14:47:09
facebook Twitter Googleplus
Photo

సల్మాన్ కెరీర్ ను ఈ మధ్యకాలంలో బాగా తిప్పేసిన రెండు సినిమాలు అంటే.. ఒకటి ఏక్తా టైగర్ అయితే రెండోది బజరంగీ భాయిజాన్ అనే చెప్పాలి. ఈ రెండు సినిమాలనూ కూడా కబీర్ ఖాన్ రూపొందించాడు. అయితే ఇప్పుడు సల్మాన్ వేసిన ఆ గూఢఛారి వేషాలకు కంటిన్యూషన్ గా ఒక సీక్వెల్ వస్తోంది.

ఈ మధ్యనే సల్మాన్ కు సుల్తాన్ సినిమా ద్వారా భారీ హిట్ అందించాడు దర్శకుడు అలి అబ్బాస్ జఫర్. మనోడు ఇప్పుడు యశ్ రాజ్ బ్యానర్ కు సదరు గూఢఛారి సినిమా సీక్వెల్ తీస్తున్నాడు. టైగర్ జిందా హై పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో మరోసారి సల్మాన్ ఖాన్ అండ్ కత్రినా కైఫ్ జత కట్టారు. గత సినిమాలో అయితే సల్మాన్ ఒక ఇండియన్ రా ఏజెంటుగా.. అలాగే కత్రినా పాకిస్తాన్ ఐఎస్ ఐ ఏజెంటుగా కనిపించారు. మరి ఈ కొత్త సినిమాలో ఎలా కనిపిస్తారో తెలియదు కాని.. ఫస్ట్ లుక్ పోస్టర్లో మాత్రం ఇద్దరూ యాక్షన్ మోడ్ లో అదరగొట్టేశారంతే.

ఈ మధ్య కాలంలో వేరే బాషల్లోని సినిమాలను రీమేక్ చేయడం మానేసి సల్మాన్ అన్నీ కొత్త కథలనే ఎంచుకుంటున్నాడు.

,  ,  ,  ,