Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2015 11:09:35
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న మహేష్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ అభిమానుల్లో అంతకంతకు క్యూరియాజిటీని పెంచుతోంది. ఇన్నాళ్లు 'శ్రీమంతుడు' అంటూ జరిగిన ప్రచారానికి ఇటీవల బ్రేక్ పడిన సంగతి విదితమే. 'శ్రీమంతుడు' కాదు, 'మగాడు' అంటూ కొత్త టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే, తాజాగా ఇది కూడా కాదని అంటున్నారు. అసలు మొదట్లో 'శ్రీమంతుడు' టైటిల్ దాదాపు ఖరారైపోయింది. అందుకే, యూనిట్ దానినే వర్కింగ్ టైటిల్ గా ప్రకటిస్తూ వచ్చింది.


అయితే, ఇటీవల ఈ సినిమా పంపిణీదారులు మహేష్ ని కలిసినప్పుడు 'శ్రీమంతుడు' టైటిల్ పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారట. మహేష్ లాంటి మాసీ హీరోకి అలాంటి సాఫ్ట్ టైటిల్ పెడితే రెస్పాన్స్ బాగుండదని, మార్చి 'మగాడు' లాంటి మాస్ టైటిల్ పెట్టమని కోరారట. దాంతో యూనిట్ అంతా సందిగ్ధంలో పడింది. వారు కోరుతున్నట్టు 'మగాడు' టైటిల్ పెడదామనుకుంటే, అది మహిళా ప్రేక్షకులను కించపరిచేలా ఉందన్న వాదన కూడా తలెత్తిందని అంటున్నారు. దీంతో మరో టైటిల్ వెతికే పనిలో పడ్డారట. మరి, ఏ టైటిల్ కన్ఫర్మ్ చేస్తారన్నది ఈ నెల 31న తేలిపోతుంది. ఎందుకంటే, ఆ రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు!

,  ,  ,  ,  ,  ,  ,  ,