Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 10:26:02
facebook Twitter Googleplus
Photo

ఏదైనా చేయొచ్చుకాని ఫ్యాన్స్ తో పెట్టుకోకూడదని త్రిషకు బాగా అర్ధమైంది. అందుకే ఈ చెన్నయ్ చంద్రం చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో కనిపించలేదు. జల్లికట్టు దెబ్బకు ఏకంగా ట్విట్టర్ వదిలేసి పారిపోయింది. నేను అసలు జల్లికట్టుకు యాంటీగా ట్వీట్లు వేయలేదు.. అందుకే నా ఎకౌంట్ ను కొన్ని రోజులు డీ యాక్టివేట్ చేస్తున్నానంటూ జనవరి 14న అమ్మడు 3.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్న తన ఎకౌంట్ ను టెంపరరీగా సస్పెండ్ చేసుకుంది.

కట్ చేస్తే.. సరిగ్గా నెల రోజుల తరువాత.. మొన్న వాలెంటైన్స్ డే ను వేదికగా చేసుకుని త్రిష మళ్ళీ ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రావడంతోనే 96 సినిమా తరువాత గజరనై సినిమాల గురించి పోస్టింగులు చేసింది. ఇవాళేమో.. ఘాజీ సినిమా సూపరంటూ వినిపిస్తోంది.. ఎప్పుడు చూపిస్తున్నావ్ రానా అంటూ భల్లాలదేవకు ఒక ట్వీటేసింది. ఆ విధంగా తిరిగి మరోసరి సోషల్ జీవితంలో ఇమిడిపోయింది అమ్మడు.

ఇకపోతే ఆమెను పన్నీర్ సెల్వం.. పళని స్వామి.. శశికళ అంశాల్లో మాట్లాడమని చాలామంది అడుగుతున్నారు. అమ్మడు జయలలితకు పెద్ద ఫ్యాన్ కాబట్టి.. ఒక ట్వీటేయ్ బేబీ అంటూ రిక్వెస్టులు చేస్తున్నారు. కాని ఒకసారి అంత పెద్ద దెబ్బ తిన్న త్రిష ఇప్పుడు అలాంటి ట్వీట్లు ఎందుకు వేస్తుంది చెప్పండి?

,  ,  ,  ,