Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2017 10:33:33
facebook Twitter Googleplus
Photo

దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్. ఇది అక్షరాలా మన దేశంలో వర్తిస్తుంది కానీ వెస్ర్టన్ ప్రపంచంలో దీన్ని కొంచం మార్చి దేశం అంటే మనుషులు కాదు దేశం అంటే వ్యాపారం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చైనా ఇదే కోవకు చెందిన దేశంని చెప్పవచ్చు. ప్రపంచ పటంలో ఉన్న అన్నీ ప్రాంతాలలో చైనా తన వ్యాపారంతో ప్రవేశించి ప్రతిదేశంలో ఉన్న ప్రజలు వాళ్ళ వస్తువులు కొనేటట్లుగా ప్రచారం చేసుకుంది. ఏ దేశంలోనైనా మనం మేడ్ ఇన్ చైనా వస్తువులు చూడొచ్చు.

అయితే ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.. చైనా వ్యాపార జైత్రయాత్ర భవిష్యుత్తులో అంతంకాక తప్పదు అని చెబుతున్నాడు. ఉపేంద్ర తన సినిమాలు ద్వారా చాలాసార్లు మన దేశం పాశ్చాత్య దేశాల సంస్కృతి సాంప్రదాయాల వలన ఇబ్బందిపడుతోంది అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే.. 1945లో అణుబాంబు వేశాక.. ఇప్పటికి 71 ఏళ్ళు తరువాత.. అమెరికా తయారుచేసిన ఒక్క గుండు సూది కూడా జపాన్ దేశంలో అమ్మలేకపోతోంది. ట్రేడ్ పాలసీ వలన కాదులే. జపాన్ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అమెరికా లో తయారు చేసే వస్తువులు కొనకూడదుని. దీన్నే మాతృదేశాభిమానం అంటారు. మనం కూడా చైనా విషయంలో ఇదే విధంగా చేయాలి. చేయి చేయి కలిపి పోరాడాలి అని చెప్పాడు. నిజంగానే ఇది కరక్టే కదూ.

నిజానికి ఒక ప్రక్కన చైనా ప్రీమియర్ జి20 సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రిని నరేంద్ర మోడిని కలిసినప్పటికీ.. ఇటు ప్రక్కన చైనా సేనలు మాత్రం సిక్కింలో నానా బీభత్సం చేస్తున్నాయి. అవసరమైన సిక్కిం ను ఇండిపెండెంట్ కంట్రీగా మారిపోవడానికి మేం సపోర్టు చేస్తాం అంటూ చెత్త కామెంట్లు కూడా చేస్తున్నాయి.

,  ,  ,  ,  ,