Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2017 10:41:45
facebook Twitter Googleplus
Photo

కొన్నేళ్ళ కిందట ఒక సినిమా వచ్చింది. మంచి కాఫీ లాంటి సినిమా. ఆ సినిమా తరవాత కాస్త హ్యాపీగా సాగిపోయే గోదావరిలా సాగిన లైఫ్ ఈస్ నాట్ సొ బ్యూటిఫుల్ కదా. అందుకే శేఖర్ కమ్ముల అనామిక తరువాత చాల గ్యాప్ తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యి వస్తున్నాడు ఫిదా చేయడానికి. ఈ సినిమా పోస్టర్ తో మళ్ళీ శేఖర్ కాఫీ తాగిస్తాడేమో చూడాలి అనిపించే లోపే ట్రైలర్ తో కాఫీ కాదు అంతకు మించి ఇంకా ఏదో రుచి పరిచయం చేస్తాను అంటున్నాడు. ఈ సినిమాలోని వచ్చిందే అనే పాట యూట్యూబ్ లో ఇప్పుడు భలే మస్తుగా ఉందిలే.

సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట పక్క హైదరాబాద్ యూత్ స్టైల్ లో ఉంటుంది. క్రీమ్ బిస్కట్ మస్తూ గాయబ్ ఈ మాట వాడని తెలంగాణ స్టూడెంట్ లేడంటే అతిశయోక్తి కాదు. వచ్చిందే మెల్లగా మెల్లగా వచ్చిందే అని మనకు క్రీమ్ బిస్కుట్ తినిపించేశారు సాయి పల్లవితోని. శాస్త్రీయ నృత్యం తెలిసిన సాయి పల్లవి ఎలా ఫోజిస్తే అందం మరింత అందంగా కనిపిస్తుందో అలానే ఆడింది ఆ పాటలో. తొలి చూపునే ప్రేమలో పడితే ఒక అమ్మాయి అబ్బాయిలలో కలిగే భావాన్ని అశోక్ తేజ చక్కగా రాశారు. పాటకు సంగీతం అండ్ గాత్రం కూడా పెళ్లి సందడికి తగ్గట్టుగానే ఉంది. ఆడవాళ్ళ హాఫ్ సారీలు అబ్బాయిలు దొంగ చూపులు బంధువుల పలకరింపులు అన్నీ కలిపి ఒక కుర్ర ప్రేమ పాట ఫిదా చేసింది అనే చెప్పవచ్చు.

దిల్ రాజు నిర్మాతగా శేఖర్ కమ్ముల డైరక్షన్లో వస్తున్న సినిమా ఫిదా.

,  ,  ,  ,  ,  ,  ,