Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2015 12:09:07
facebook Twitter Googleplus
Photo

వడ్డే నవీన్ గుర్తున్నాడు కదూ? 'పెళ్లి', 'తాంబూలాలు', 'స్నేహితులు', 'చాలా బాగుంది' వంటి సినిమాల ద్వారా ఒకప్పుడు హీరోగా రాణించిన ఈ నటుడు గత కొన్నేళ్లుగా కనుమరుగయ్యాడు. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు తెరపైకి వస్తున్నాడు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించే ఛాన్స్ పొందాడు. మంచు మనోజ్ హీరోగా వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం 'గొలుసు'లో నవీన్ ఓ కీలక పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడు. నెగటివ్ షేడ్స్ తో సాగే ఈ పాత్ర, నవీన్ సెకండ్ ఇన్నింగ్సుకి నాంది పలుకుతుందని అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,