Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2016 13:22:10
facebook Twitter Googleplus
Photo

అత్తారింటికి దారేది డైరక్టర్ త్రివిక్రమ్. అలాగే ఊపిరి సినిమాను తీసింది వంశీ పైడిపల్లి. మరి ఆ సినిమా దెబ్బకు ఈ సినిమా తీయడమేంటి? పైగా అత్తారింటికి దారేది అనేది ప్యూర్ కమర్షియల్ సినిమా. ఓవర్ బోర్డు హీరోయిజమ్ నుండి కామెడీ ఉంటుంది. కాని ఊపిరి సినిమా మాత్రం రియాల్టీకి దగ్గరగా ఉన్న ఎమోషనల్ డ్రామా. మరి రెండింటికీ సంబంధం ఏంటి?

నిజానికి ''అత్తారింటికి దారేది'' సినిమా తొలి డేట్ ప్రకటించినప్పుడు.. దానితోపాటే ''ఎవడు'' సినిమా కూడా రిలీజ్ అవుతుందని దిల్ రాజు ప్రకటించాడు. రెండు మెగా సినిమాలు ఒకేసారి వస్తే నష్టం ఏం లేదులే అంటూ ట్విస్టిచ్చాడు కూడా. కాని చివరకు ఎవడు సినిమాను ఆర్నెల్లు పోస్టుపోన్ చేశారు. అత్తారింటికి దారేది కొన్ని అనూహ్య పరిస్థితుల్లో లీకేజ్ సమస్యలను ఫేస్ చేస్తూ.. రిలీజైంది. అందుకే పోటీలో నుండి ఎవడును తప్పించారు. ఆ తరువాతి సంక్రాంతికి వచ్చిందీ సినిమా. అయితే ఈ ఆర్నెల్లూ.. వంశీ పైడిపల్లి ఇంకో ప్రాజెక్టు ఏదీ చేయలేదు. ఎవడు రిజల్టు వచ్చాకనే తదుపరి సినిమా చేయాలని ఫిక్సయ్యాడట. ఈలోపు ఇంట్లో ఖాళీగా ఉండి.. వాళ్ల తమ్ముడు ఇచ్చిన ''ఇన్ టచ్ బుల్స్'' డివిడి ఎందుకోగాని రెండోసారి వేసుకొని చూశాడట. ఆ దెబ్బతో ఈ సినిమాను రీమేక్ చేయాలని ఘనంగా ఫిక్సయిపోయాడు. వెంటనే విషయాన్ని నిర్మాత పివిపి సినిమాకు చెబితే.. ఆయన వెంటనే కరణ్ జోహార్ దగ్గర నుండి తెలుగు అండ్ తమిళ్ రైట్స్ కొన్నాడు.

అర్ధమైందా.. అత్తారింటికి దారేది వలన ఆర్నెల్లు ఖాళీగా ఉంటూ.. ఊపిరి సినిమాకు బీజం వేశాడు వంశీ.

,  ,  ,  ,  ,  ,