Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2017 10:41:46
facebook Twitter Googleplus
Photo

సినిమాల్ని ఏ రకంగా టచ్ చేసినా అది సాహసమే అవుతుంది. అలాంటి సినిమాల్ని రీమేక్ చేసినా.. వాటిని మరో రకంగా వాడుకోవాలని చూసినా ఫలితం తేడా కొట్టేస్తుంటుంది. దిల్ రాజు లాంటి మంచి అభిరుచి ఉన్న నిర్మాత ‘మరో చరిత్ర’ను ఈ ట్రెండుకు తగ్గట్లు రీమేక్ చేసే ప్రయత్నం చేశాడు. అది దారుణంగా బెడిసికొట్టింది. శంకరాభరణం లాంటి క్లాసిక్ టైటిల్ తీసుకుని.. ఈ మధ్య నిఖిల్ హీరోగా ఒక సినిమా తీశారు. దాని ఫలితమేంటో తెలిసిందే. కాబట్టే గొప్ప సినిమాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.

ఐతే పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన.. తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్ అనిపించుకున్న ‘తొలి ప్రేమ’ సినిమాను వాడుకోవడానికి నిర్ణయించుకుంది వరుణ్ తేజ్ కొత్త సినిమా టీం. ఈ చిత్రానికి ఏకంగా తొలి ప్రేమ అనే టైటిల్ పెట్టేశారు. ఈ టైటిల్ వెంటనే జనాల్ని ఆకర్షించేసరికి టీం అంతా ఖుషీ అయిపోయింది. దీని టైటిల్ లోగో.. ఫస్ట్ లుక్ ఓకే అనిపించాయి. తొలి ప్రేమ స్థాయి మంచి ప్రేమకథ చూడబోతున్నామనే ఆసక్తి కనిపించింది.

కానీ ఇప్పుడు తొలి ప్రేమ టీజర్ చూశాక అందరూ ఒక్కసారిగా డిజప్పాయింట్ అయిపోయారు. ఏముంది ఈ టీజర్లో అని పెదవి విరిచేశారు. ఫస్ట్ లవ్ ను ఎవరూ మరిచిపోలేరన్న ఒక రొటీన్ డైలాగ్ మినహాయిస్తే ఇందులో ఏ విశేషం లేదు. టీజర్లో అసలేమాత్రం ఫీల్ కనిపించలేదు. ఇంకో టైటిల్ పెట్టుకుని ఈ టీజర్ లాంచ్ చేసి ఉంటే రెస్పాన్స్ ఎలా ఉండేదో కానీ.. తొలి ప్రేమ అనే టైటిల్ తో ఇలా ఏ స్పెషాలిటీ లేని టీజర్ వదిలేసరికి నిరాశ వ్యక్తమైంది. తొలి ప్రేమ అనే టైటిల్ పెట్టుకుని జనాల్ని ఆకర్షించారు కానీ.. ఇప్పుడు ఆ క్లాసిక్ తాలూకు బర్డెన్ మోయాల్సి వస్తోంది. ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడం ఇప్పుడు వీరికి పెద్ద సవాలు.

,  ,  ,  ,  ,