Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jan-2017 11:05:14
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్యే మిస్టర్ టీజర్ తో మెగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు వరుణ్ తేజ్. ఇప్పుడు తన కొత్త సినిమా పోస్టర్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. మిస్టర్.. ఫిదా తర్వాత వరుణ్ నటించబోయే కొత్త సినిమా పోస్టర్ ఈ రోజు లాంచ్ చేశారు. చాన్నాళ్లుగా చర్చల్లో ఉన్న డెబ్యూ డైరెక్టర్ వెంకీ అట్లూరి తీయబోయే సినిమానే ఇది. గతంలో ఫీల్ మై లవ్ అంటూ ఈ సినిమా టైటిల్ గురించి ప్రచారం జరిగింది. ఐతే ఈ రోజు టైటిల్ ఏమీ లేకుండానే పోస్టర్ లాంచ్ చేశారు. ఇంతకుముందు అనుకున్నట్లు దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించట్లేదు. ఛత్రపతి ప్రసాద్ ?శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర? బేనర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వరుణ్ తేజ్ చాలా అందంగా కనిపిస్తున్నాడు ఈ సినిమా పోస్టర్లలో గురువారం అతడి పుట్టిన రోజు నేపథ్యంలో విషెస్ చెబుతూ ఈ సినిమాను అనౌన్స్ చేశాడు నిర్మాత ప్రసాద్. స్నేహగీతం తో పాటు కొన్ని సినిమాల్లో నటించిన వెంకీ అట్లూరి మెగా ఫోన్ పడుతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్నందించబోతుండటం విశేషం. తమిళంలో ?రాజా రాణి?.. ?కత్తి?.. ?తెరి? లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఛాయాగ్రహణం అందించిన జార్జ్ సి.విలియమ్స్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతుండటం విశేషం. ఈ ఏడాది ఆఖర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్లాన్.

,  ,  ,  ,