Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2016 14:53:13
facebook Twitter Googleplus
Photo

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ..హీరోగా తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకున్న కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌. ఈ అగ్ర కథానాయకుడు నటించనున్న నూతన చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ?నేను శైలజ? చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న యువ దర్శకుడు కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ సమర్పణలో పి.ఆర్‌.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అక్టోబర్‌లో ప్రారంభంకానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, దర్శకుడు కిషోర్‌ తిరుమల తెలియజూస్తూ?అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇంతకు ముందు వెంకటేష్‌ నటించిన ?ఆడవారిమాటలకు అర్థాలే వేరులే?, ?మల్లీశ్వరి?, ?నువ్వునాకునచ్చావ్‌? తరహాలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. వెంకటేష్‌గారి నుండి కుటుంబ ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రంలో వెంకటేష్‌గారి పాత్ర చాలా సహజంగా ఉంటుంది?అక్టోబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభిస్తాం. త్వరలోనే వెంకటేష్‌గారి సరసన నటించే కథానాయిక తో పాటు.. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాము..అని తెలిపారు.

,  ,  ,  ,  ,