Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2017 11:30:49
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఈ మధ్య అప్పుడప్పుడూ బాగా గ్యాప్ వచ్చేస్తోంది. దృశ్యం సినిమా చేయడానికి ముందు అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆపై గోపాల గోపాల తర్వాత కూడా ఇలాగే చాలా గ్యాప్ తీసుకున్నాడు వెంకీ. దాదాపు ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయాడు వెంకీ. ఇప్పుడు గురు తర్వాత కూడా వెంకీ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు. తన తర్వాతి సినిమా విషయంలో క్లారిటీ లేకపోవడంతో వెంకీ ఇప్పుడిప్పుడే ముఖానికి రంగేసుకునేలా లేడు. గురు సినిమాను ఆయన గత ఏడాది చివరికే పూర్తి చేశాడు. అప్పట్నుంచి ఖాళీగానే ఉంటున్నాడు. కిషోర్ తిరుమలతో అనుకున్న సినిమా.. పూరి జగన్నాథ్ తో అనుకున్న మూవీ.. రెండూ కూడా పట్టాలెక్కలేదు.

ఈ మధ్య ఏదో జాలీ ఎల్ ఎల్బీ-2 రీమేక్ లో వెంకీ నటిస్తాడని ప్రచారం జరిగింది కానీ.. అదేమీ కన్ఫమ్ కాలేదు. వెంకీ దగ్గరికి ఇంకా ఆ ప్రపోజలే వెళ్లలేదు. ప్రస్తుతం వెంకీ ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. అది ముగించుకుని వచ్చాక ఈ రీమేక్ సంగతేదో చూస్తాడు. వెంకీ గత సినిమా కూడా రీమేకే అయిన నేపథ్యంలో మళ్లీ ఇది కూడా చేస్తాడా అన్నది డౌటు. ఒకవేళ ఈ సినిమాకు ఓకే చెప్పినా.. అది పట్టాలెక్కడానికి ఇంకా చాలా టైం పడుతుంది. దర్శకుడు ఖరారవ్వాలి. తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్టు రెడీ చేయాలి. కాబట్టి ఈ ఏడాది లాస్ట్ క్వార్టర్ లో కానీ సినిమా మొదలయ్యే అవకాశం లేదు. అంటే వెంకీని మళ్లీ తెరమీద చూసేది 2018లోనే అన్నమాట.

,  ,  ,  ,  ,