Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2016 12:20:15
facebook Twitter Googleplus
Photo

మార్కెట్ లో బిచ్చగాడు తెచ్చిన సంచ లనంతో విజయ్ ఆంటోని రాబోయే సినిమాకు టాలీవుడ్‌లో విపరీతమైన బిజినెస్ క్రేజ్ ఏర్పడుతోంది. డబ్బింగ్ బొమ్మ కళావిహీనం అవుతున్న సమయంలో వినూత్న ఆలోచనతో సినిమా చేసి, అనువాద సినిమాకు ఆక్సిజన్ అయ్యారు విజయ్ ఆంటోని. ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్నకొత్త సినిమా ?సైతాన్? తెలుగులో అదే పేరుతో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నారు. భిన్నమైన కథలు ఎంచుకుంటాడనే గుడ్ విల్ ఉన్న ఈ హీరోకు ?బిచ్చగాడు? సక్సెస్ తోడవడంతో ?సైతాన్? కోసం తెలుగు బయ్యర్లు పోటీ పడే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అనువాద హక్కులను ఎస్. వేణుగోపాల్ దక్కించుకున్నారు. ఎం. శివకుమార్ సమర్పణలో వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నెలలోనే పాటలను విడుదల చేయాలనుకుంటున్నారు.

,  ,  ,  ,  ,