Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2016 12:48:31
facebook Twitter Googleplus
Photo

పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయ్. ఎంత స్పీడ్ గా ఆఫర్లు వచ్చినా.. ఈ హీరో మాత్రం సెలెక్టివ్ గానే అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే చేతినిండా సినిమాలున్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడో కొత్త ప్రాజెక్ట్ కి కమిట్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ద్వారక మూవీతో పాటు.. అర్జున్ రెడ్డి అనే ప్రాజెక్టును కూడా ఫినిష్ చేస్తున్నాడు విజయ్. ఈ రెండు సినిమాలను పోస్ట్ ప్రొడక్షన్ స్థాయికి తెచ్చాక.. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్ర నిర్మాణంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భాగం కానుండడంతో.. బజ్ క్రియేట్ అవుతోంది. అయితే.. ఒకేసారి రెండు సినిమాలను షూట్ చేయాలని భావిస్తున్న విజయ్ దేవరకొండ.. మరోచిత్రానికి కూడా సరే అన్నాడట. గతంలో ది ఎండ్ అనే థ్రిల్లర్ చిత్రాన్ని తీసిన రాహుల్ సాంక్రిత్యన్ తో ఈ కుర్రాడి సినిమా మొదలు కానుందని తెలుస్తోంది.

రాహుల్ సాంక్రిత్యన్ చెప్పిన డిఫరెంట్ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేయడంతో.. వెంటనే స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడట విజయ్ దేవరకొండ. నందినీరెడ్డి మూవీతో పాటే ఇది కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకునేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకేసారి రెండు మూవీస్ పట్టాలెక్కించాలనే ఈ హీరో ఐడియా ఏదో బాగానే ఉంది కదూ.

,  ,  ,  ,  ,