Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Aug-2016 11:42:25
facebook Twitter Googleplus
Photo

ప్రతి ఊరిలోనూ ప్రజల సమస్యలను పరిష్కరించ డానికి, అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం బిగించాలి. అలా ప్రజలకు న్యాయం చేయడానికి నడుం బిగించిన ఓ యువకుడికథతో తెరకెక్కుతోన్న చిత్రం ఒక్కడొచ్చాడు. విశాల్, తమన్నా జంటగా సూరజ్ దర్శకత్వంలో జి.హరి నిర్మిస్తున్న చిత్రమిది. విశాల్ బర్త్‌డే సందర్భంగా నేడు టీజర్ విడుదల చేస్తున్నారు. విశాల్ మాట్లాడుతూ - ??ప్రతి ఊరిలోనూ ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యతో చిత్రం తెరకెక్కుతోంది. నా లుక్, పాత్ర చిత్రణ గత చిత్రాల కంటే విభిన్నంగా, కొత్తగా ఉంటాయి.

ఈ చిత్రం తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా?? అన్నారు. ??రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. శ్రుతీ హాసన్ ఓ పాట పాడడం విశేషం. దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం?? అని నిర్మాత జి.హరి తెలిపారు. జగపతిబాబు, తరుణ్ అరోరా, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: రిచర్డ్ ఎం.నాథన్, మ్యూజిక్: హిప్‌హాప్ తమిళ, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్, సమర్పణ: ఎం.పురుషోత్తమ్.

,  ,  ,  ,  ,  ,