Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Sep-2017 13:17:24
facebook Twitter Googleplus
Photo

సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తోంది. దేశంలో ఏ ఇతర ఇండస్ట్రీతో పోల్చినా.. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకే ఈ తాకిడి బాగా ఎక్కువ. నడిగర్ సంఘం తరఫున ఎన్నిక అయినప్పటి నుంచి కోలీవుడ్ హీరో విశాల్ వీరిపై ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు.

పైరసీ చేస్తున్న షాపులపై స్వయానా దాడులకు దిగాడు. ఓ కీలక అడ్మిన్ అరెస్ట్ అయేందుకు కూడా కారణం అయ్యాడు విశాల్. అలాగని పైరసీని అడ్డుకోవడంలో ఇసుమంతైనా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ముఖ్యంగా తమిళ్ రాకర్స్ పై అయితే.. యుద్ధమే చేస్తున్నాడు విశాల్. మరి ఇలా నేరుగా ఫైటింగ్ కు దిగితే.. పైరసీదారులు బెదిరిపోతారని అనుకోవడం కామన్. కానీ రీసెంట్ గా విశాల్ నటించిన తుప్పరివాలన్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ విషయంలో విశాల్ ఫ్యాన్స్ కూడా బాగా యాక్టివ్ గా ఉండి.. ఎక్కడా పైరసీ కాకుండా ఉండేందుకు కష్టపడ్డారు. అయినా సరే.. తుప్పరివాలన్ ను నెట్ లో పెట్టేశారు తమిళ్ రాకర్స్.

ఈ ఏడాది ప్రారంభంలో తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ నిర్వాహకులు.. సూర్య నటించిన సింగం3 చిత్రాన్ని రిలీజ్ రోజు మొదటి ఆట పడేందుకు ముందే నెట్ లో పెడతామని ఛాలెంట్ చేసి మరీ.. ఉదయం 11 గంటలకే సైట్ లో అప్ లోడ్ చేశారు. ఇప్పుడు తుప్పరి వాలన్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది.

,  ,  ,  ,  ,  ,