Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2017 12:07:06
facebook Twitter Googleplus
Photo

ఫ్యామిలీ ఇంట మరోసారి పిల్లల సందడి కనిపించనుందట. మోహన్ బాబు మరోసారి తాత కాబోతున్నట్లు ఫిలిం నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. మోహన్ బాబు పెద్ద కొడుకు కం టాలీవుడ్ హీరో అయిన మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నట్లు చెబుతున్నారు.

మంచు విష్ణు భార్య విరానిక ప్రస్తుతం గర్భవతి అంటున్నారు. నిజానికి ఈ జంటకు గతంలోనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2009లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు.. 2011లో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు ఆడపిల్లలకు అరియానా.. వివియానా అంటూ నామకరణం చేయగా.. వీరిద్దరూ అమెరికాలోనే పుట్టడం విశేషం. ఇప్పుడు విరానిక మరోసారి గర్భంతో ఉందని.. వీరికి మరోసారి కవల పిల్లలు పుట్టనున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అందుకే విరానిక ప్రస్తుతం యూఎస్ లోనే నివాసం ఉంటోందట కూడా. మరోవైపు విష్ణు కూడా త్వరలో అమెరికా బయల్దేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఆచారి అమెరికా యాత్ర అంటూ మల్లాది రచనలో వచ్చిన నవలను సినిమాగా మలుస్తున్న విష్ణు.. ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి అమెరికా వెళ్లనున్నాడట.

,  ,  ,  ,